![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -130 లో.. రామలక్ష్మి, సీతాకాంత్ మధ్య దూరం పెంచాలనుకుంటుంది శ్రీలత. సీతాకాంత్ కి క్యారేజ్ తీసుకొని వెళ్ళాలని శ్రీవల్లిని సిద్ధం చేయమని చెప్తుంది శ్రీలత. దాంతో శ్రీవల్లి రెడీ చేస్తుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీ పుట్టింటికి వెళ్తున్నావా అని శ్రీవల్లిని అడుగుతుంది. లేదు బావగారికి క్యారేజ్ రెడీ చేయమని అత్తయ్య చెప్పిందని శ్రీవల్లి అంటుంది. నా భర్తకి క్యారేజ్ తీసుకొని వెళ్ళడానికి నేనున్నా కదా మీరెందుకని రామలక్ష్మి తీసుకొని వెళ్తుంది. అది చూసి దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని శ్రీలత అనుకుంటుంది.
మరొకవైపు సీతాకాంత్ ఇంట్లో జరిగిన విషయాలు గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి.. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. రామలక్ష్మి నీకేమైనా అవుతుందేమోనని భయంతో అలా చేసిందని అంటాడు. అయిన అలా ఎలా అంటుంది. నాకు చాలా బాధగా ఉందని సీతాకాంత్ అంటాడు. ఇదంతా నీవల్లే.. ప్రతి తల్లి కొడుకుపై తనే ప్రేమ చూపించాలనుకుంటుంది. అలాగే ప్రతీ భార్య తన భర్తకి తానే ప్రేమ ఎక్కువ పంచాలనుకుంటుంది. అందుకే ఈ సమస్య అని పెద్దాయన అంటాడు. రామలక్ష్మికి అంత ప్రేమ ఏం లేదని సీతాకాంత్ అంటాడు అప్పుడే రామలక్ష్మి క్యారేజ్ తో ఆఫీస్ కి వస్తుంది. ఇద్దరు మాట్లాడుకోకుండా పెద్దాయనకి చెప్తుంటారు. మీ భార్యాభర్తల మధ్య నేనుండలేను.. మీరే మాట్లాడుకోండి అని చెప్పేసి వెళ్తాడు. ఆ తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. మీకు టైమ్ అవుతుంది భోజనం చెయ్యండని రామలక్ష్మి అంటుంది. వర్క్ ఉందని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి ల్యాప్ టాప్ క్లోజ్ చేసి భోజనం వడ్డీస్తుంది. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు వాళ్ళని దూరం నుండి పెద్దాయన చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే మాణిక్యం వెళ్తుంటే పెద్దాయన ఆపి.. వాళ్ళని డిస్టబ్ చెయ్యకని చెప్తాడు. రామలక్ష్మితో మాట్లాడాలని మాణిక్యం తన కోసం వెయిట్ చేస్తుంటాడు.
ఆ తర్వాత చూసావా రామాలక్ష్మికి నువ్వు అంటే ఎంత ప్రేమోనని సీతాకాంత్ తో పెద్దాయన అంటాడు. కానీ నాకు రామలక్ష్మి అర్ధం కాదని సీతాకాంత్ అంటాడు. కాసేపటికి మాణిక్యం రామలక్ష్మితో మాణిక్యం మాట్లాడతాడు. ఇంట్లో గొడవ అయిందట మీ అతయ్యతో జాగ్రత్త అని చెప్పగానే.. మా ఇంటి విషయాలు నీకు అనవసరమని రామలక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో హాల్లో కూర్చొని ఉన్న శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |